telugu

శ్రీకర కవితలు

తపనపడే వాడికే తలనొప్పులు…
తాపత్రయ పడే వాడికే తిప్పలు…
తల వంచకు ఓ తమ్ముడా…
తారవవుతవు తొందరలో…. 🎇✨

తుడిస్తే పోయే కన్నీళ్ళకేం తెలుసు,
తలకిందుల ఈ జీవితపు విలువలు.😢
తాగినోడికి ఆనందం,
తాగనోడికి అయోమయం.😖

పారిపోతే పారిపోయేవి కావు ఈ కష్టాలు, 🏃
ఎదురెల్తే ఎదురుకోలేవు ఆ కష్టాలు,
నీకు నువ్వు గా పోరాడు,😎
రేపటి రేపు నీకు రెక్కలిస్తుంది.🕊

పైసా లో పరమాత్మని చూసావా??🙏
పైసానే పవర్ అంటున్నవా??💪
పైసాకి తెలుసు ప్రాణం వరకే తన ప్రయాణం అని!! 👍
పైసాకెేం తెలుసు ప్రపంచంలోని బంధాల విలువ!!👎

ప్రేమ మత్తు పిచ్చొల్లని చేస్తుంది!! 😵
మద్యం మత్తు మహాత్ములను చేస్తుంది!!😇

నా జీవితం లో నేను రాసిన మొట్టమొదటి కవితలు ఇవి. నచ్చుతాయి అని ఆశిస్తూ……
ఇట్లు మీ,
శ్రీ
🙏
——————————————————————–
గమనిక: తెలుగు భాషలో కవితలు రాయాలని చాలా రోజులుగా సాగుతున్న నా ఈ చిన్ని ప్రయత్నంలో నేను రాసిన ఈ జీవిత సత్యాల లోని భాష్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్స్ లలో తెలుపగలరు.